Wednesday, April 9, 2008

ఉగాది శుభాకాంక్షలు.

సర్వధారి నామ సంవత్సరం మీ అందరికీ సంతోషాన్నీ, ఆరోగ్యాన్నీ, సంపదల్నీ ఇవ్వాలని కోరుకుంటున్నాను.

ఈ పండగ 3 రోజులు సెలవల్లో బాగా తిరిగాను. ఈ ఉగాది మా పిన్ని వాళ్ళ ఇంట్లో చాలా ఆనందంగా గడిచింది. ఈ కర్ణాటక తమిళనాడుల మధ్య గొడవల పుణ్యమా అని వెల్లూరులో లక్ష్మీనారాయణి గుడి అంతా ఖాళీగా ఉంది. మామూలుగా 4 గంటలు పట్టేదిట దర్శనానికి. ఈసారి ఎవ్వరూ లేరు. మేమే ఓ గంట కూర్చుని వచ్చాము.
1.5 టన్నుల బంగారంతో దాదాపు 550 కోట్లతో కట్టిన గుడి అది. అద్భుతంగా ఉంది. కానీ భక్తి భావం కలిగించె విధంగా లేదు అనిపించింది. అక్కడ ఫొటోలు తీయనివ్వరు కానీ ఇది ఎక్కడో అంతర్జాలం లో దొరికింది. (ఫొటోలు అవే మారతాయి)



తిరుపతిలో దర్శనం కూడా చాలా తేలికగా ఐంది.
ఉగాది అలంకారం చాలా బావుంది. పళ్ళు పూలు కలిపి దండలు కట్టారు. మొత్తం గుడి అంతా పూలతో నింపేసారు.
అంతా బానే ఉందికానీ మహాద్వారం వద్ద ఆ కొత్త చానల్ (SVBC) వాళ్ళు అనుకుంటా, శుభాకాంక్షలు బోర్డ్ పెట్టారు. వాళ్ళ తెలుగు మాత్రం ఏడిసినట్టుంది. ఉగాది అని రాయటం రాలేదు. "ఊ" రాసి ఆ దీర్ఘం చరిపేసారు. మీరే చూడండి.


ఈ కొత్త సంవత్సరంలొ ఆ శ్రీనివాసుడు జనాలకి మాతృభాష మీద అభిమానం, తెలుగు భాషా పరిజ్ఞానం కలిగిస్తాడని కోరుకుంటున్నాను.