ఓ రెండు నెలల క్రితం ఇంటికి రెండు బంగారు చేపలు తెచ్చాను. fan-tail goldfish. చాలా చిన్న పిల్లలు.
వాటి పేర్లు కూడా పెట్టాము. పెద్దది "సుమతి", కాస్త చిన్నది "కాలమతి".
వాటికి తిండి పెట్టినప్పుడు సుమతి కాస్త తెలివిగా కుండీ మధ్యలో ఉండి ముందే వేసింది వేసినట్టు తినేసేది. అందుకే దానికి ఆ పేరు.
చాలా active గా ఉండేవి. ఒక దాని వెంట ఒకటి పడుతూ కుండీలో పెట్టిన కృత్రిమ మోక్కలు, గవ్వలతో ఆడుకుంటూ... వాటికి మా మొఖాలు కూడా గుర్తే. ప్రతీరోజూ 7am/pm కల్లా మేము హాల్ లోకి రాగానే అవి తిండి కోసం డాన్సు మొదలెట్టేవి. వేరే ఎవరైనా వస్తే మొక్క వెనకాల దాక్కునేవి. ఎప్పుడైనా మా ఆవిడ వేలు పెడితే తాకనిచ్చేవి కూడా...
ఇక్కడ చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో.
ఈ రోజు నా అజాగ్రత్త వల్ల చేపపిల్లలు అకస్మాత్తుగా చనిపోయాయి. :'-(
నీరు మార్చేటప్పుడు మొత్తం అంతా ఒకేసారి మార్చకూడదు. ఈ రోజు పొరపాటున పాత నీరు అంతా పారపోసేసాను. వాటిని కొత్త నీటి లో వేయగానే పాపం ఆ చిట్టి ప్రాణాలు ఓ గంట అవస్థపడ్డాయ్. మాకు సంగతి అర్ధమయ్యేలోపు అంతా అయిపోయింది. :-(
ఇక బుధ్ధొచ్చింది. మళ్ళీ ఇలా చేపలనీ ఇంట్లోకి తేను. వాటి ప్రాణాలతో చెలగాటం ఆడే హక్కు మనకు లేదని తెలుసుకున్నాను.