Monday, March 23, 2009

నా బంగారు చేపలకి శ్రధ్ధాంజలి.

ఈ రోజు నాకు చాలా బాధగా ఉంది.
ఓ రెండు నెలల క్రితం ఇంటికి రెండు బంగారు చేపలు తెచ్చాను. fan-tail goldfish. చాలా చిన్న పిల్లలు.
వాటి పేర్లు కూడా పెట్టాము. పెద్దది "సుమతి", కాస్త చిన్నది "కాలమతి".
వాటికి తిండి పెట్టినప్పుడు సుమతి కాస్త తెలివిగా కుండీ మధ్యలో ఉండి ముందే వేసింది వేసినట్టు తినేసేది. అందుకే దానికి ఆ పేరు.
చాలా active గా ఉండేవి. ఒక దాని వెంట ఒకటి పడుతూ కుండీలో పెట్టిన కృత్రిమ మోక్కలు, గవ్వలతో ఆడుకుంటూ... వాటికి మా మొఖాలు కూడా గుర్తే. ప్రతీరోజూ 7am/pm కల్లా మేము హాల్ లోకి రాగానే అవి తిండి కోసం డాన్సు మొదలెట్టేవి. వేరే ఎవరైనా వస్తే మొక్క వెనకాల దాక్కునేవి. ఎప్పుడైనా మా ఆవిడ వేలు పెడితే తాకనిచ్చేవి కూడా...
ఇక్కడ చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో.











ఈ రోజు నా అజాగ్రత్త వల్ల చేపపిల్లలు అకస్మాత్తుగా చనిపోయాయి. :'-(
నీరు మార్చేటప్పుడు మొత్తం అంతా ఒకేసారి మార్చకూడదు. ఈ రోజు పొరపాటున పాత నీరు అంతా పారపోసేసాను. వాటిని కొత్త నీటి లో వేయగానే పాపం ఆ చిట్టి ప్రాణాలు ఓ గంట అవస్థపడ్డాయ్. మాకు సంగతి అర్ధమయ్యేలోపు అంతా అయిపోయింది. :-(
ఇక బుధ్ధొచ్చింది. మళ్ళీ ఇలా చేపలనీ ఇంట్లోకి తేను. వాటి ప్రాణాలతో చెలగాటం ఆడే హక్కు మనకు లేదని తెలుసుకున్నాను.

6 comments:

పరిమళం said...

నాక్కూడా ఎక్వేరియం తెచ్చుకోవాలని ఉండేది కానీ షాప్ వరకూ వెళ్ళినప్పుడల్లా బుజ్జి చేప పిల్లల్ని చూసి నాదగ్గర చచ్చిపోతాయేమో అనే భయంతో చాలా సార్లు కొనకుండానే వెనక్కి వచ్చేశాను .ప్చ్ ...ఇంత బాధగా ఉంటుందన్న మాట .

శేఖర్ పెద్దగోపు said...

రవి కిరణ్ గారు,
ఆక్వేరియంలో చేపలు చనిపోవటానికి చాలా కారణాలు ఉంటాయి.
బౌల్స్ లో చేపలు పెంచటం అంత మంచిది కాదు. గోల్డ్ ఫిష్ లాంటి చేపలకు నీటిలో ఆక్సిజన్ శాతం ఎక్కువగా ఉండాలి. నీటి క్వాలిటి ఏమాత్రం తగ్గిన తొందరగా జబ్బుకు గురి అవుతాయి. అందువల్ల మీరు కనీసం ఒక అడుగు ఉండే అక్వేరియం తీసుకోండి. నీటి మీద వైశాల్యం ఎక్కువగా ఉంటే ఆక్సిజన్ నీటిలో కరిగే రేటు ఎక్కువగా ఉంటుంది. బౌల్స్ కి ద్వారం చిన్నగా ఉండటం వల్ల ఎక్కువ ఆక్సిజన్ నీటిలో కరగదు. అలాగే ఒక ఎరేషన్ సిస్టం ( నీటిలో బుడగలు ఉత్పత్తి చేసే పరికరం )ని కొనుక్కోండి. అది ఆక్సిజన్ శాతం నీటిలో తగ్గకుండా చూస్తుంది.

చాలా మంది అక్వేరియం షాపు వాళ్ళు కొత్తగా హాబీ మొదలు పెట్టె వారికి, అందంగా ఆకర్షణీయంగా ఉండటం వల్ల గోల్డ్ ఫిష్ అమ్మేస్తుంటారు. కాని బిగినర్స్ కి ఇవి అంత మంచివి కాదు.

పైన చెప్పిన విషయాలు మీకు పాటించటం కొంచం కష్టం అయితే, అదే బౌల్ లో రెండు రంగు రంగుల గప్పి చేపలు వేయండి . ఇవి కొంచం క్లిష్ట పరిస్థితులను కూడా తట్టుకుంటాయి.

కొంచం మనం కొన్న చేపల మీద రీసెర్చ్ చేసి కొంటె వాటిని ఎలా పెంచాలో తెలుస్తూంది. అప్పుడే అవి హుషారుగా తిరుగుతూ మనల్ని ఆహ్లాద పరుస్తాయి. కొన్ని చేపల ప్రోఫైల్స్ కొరకు క్రింది సైట్ చూడండి.
www.aqua-andhra.co.cc (telugu site under construction )
www.aquahobby.com

మీకు ఇంకేమైనా సందేహాలుంటే నాకు ఈమెయిలు చేయండి. నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకుంటాను.

Unknown said...

మేము కూడా రెండు నెలల క్రితం aquarium కొని తెచ్చాం దాంతో పాటు 8 ఫిషేస్ కూడా .ప్రస్తుతం మిగిలింది ఒక చేప కొత్త గా పుట్టిన రెండు పిల్ల చేపలు . పిల్లలు అడిగారు కదా అని చాల సర్వే చేసి తీసుకున్నా . మొదటి జాగర్త ఏంటంటే మీ ఇంట్లో లాంటి జార్ టైపు అస్సలు తీసుకో కూడదు , ఎందుకంటె అందులో వాటికీ ఫ్రీ గా తిరగటానికి స్తలం వుండదు. స్క్వేర్ టైపు తీసుకోడం మంచింది. మేము చైనా made తీసుకున్నాం దాని కాస్ట్ ౩౦౦౦ అందులో oxigen సప్లై కి ఎలక్ట్రిక్ operated మోటార్ , ట్యూబ్ లైట్ కూడా వుంటాయి. వారని కోసారి సగం నీళ్ళు , నెలకోసారి పూర్తీ గా తిసేసి itching రాకుండా ఏదో మందు ఇచ్చాడు నీళ్ళు మార్చేటప్పుడు కలపమని.మున్సిపల్ వాటర్ పోస్తే ఫ్లోరినే వుండదు కాబట్టి దాంట్లో కలపడానికి నీలి మందు వాడాలి బోర్ వాటర్ కి అయితే అవసరం లేదు. రోజుకి రెండు సార్లు మాత్రమే చిన్న గోలిల లాంటి తిండి వెయ్యాలని ఇచ్చాడు.అయిన గాని చేపలు ఎందుకు చని పోతున్నాయో మరి? నిల్లన్నీ తీసేస్తే చచ్చి పోతాయా?మరి marble స్టోన్స్ కడగాలంటే తప్పని సరిగా నిల్లన్నీ తీసే నెలకోసారి కడగాలి . ఇంకో డౌట్ ఏంటంటే చేప పిల్లల్ని పెద్ద చేపలు తినేస్తాయ?అందుకే 14 చేప పిల్లని కౌంట్ చేస్తే చివరకి రెండే మిగిలాయి .ఏమన్నా చేపల్ని పెంచడం కుక్కని పెంచడం కన్నా కష్టమే అని అర్ధం అయ్యింది .

శేఖర్ పెద్దగోపు said...

రవి గారు, ముందుగా మీ ఆక్వేరియంలో ఉన్న చేప పిల్లలను వేరొక పాత్రలోకి మార్చండి. చేపలు వాటి పిల్లలను తినేస్తాయి. ఇంకా మీ చేపలు చనిపోయే విషయానికి వస్తే,
ఇక్కడ ఒక విషయం అర్ధం చేసుకోవాలి. చేపలు నీటి ఉష్ట్నోగ్రతలలో ( మిగతా నీటి పరామితులైన Ph, Hardyness..etc) సడన్ గా మార్పు వస్తే అవి ఎక్కువ ఒత్తిడికి గురి అవుతాయి. కొన్ని సార్లు ఈ తేడా ఎక్కువగా ఉంటె వెంటనే చచ్చి పోతాయి. ఈ మార్పులు సాదారణంగా నీరు మారుస్తున్నప్పుడు వస్తాయి.

ఆక్వేరియంలో ఉంచాల్సిన దానికన్నా ఎక్కువ చేపలు ఉంచినట్టయితే, చేపల విసర్జితాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యి నీటిలో అమ్మోనియాను తయారు చేస్తాయి. ఈ పదార్దం చేపలకు చాలా హాని కరం.

మొత్తం అక్వేరియం నీటిని మార్చటం సరైన పద్దతి కాదు. గాజు గోడలను స్క్రబ్బార్ తో క్లీన్ చేసి, ఒక పొడుగాటి గొట్టం తో నీటి అడుగున వున్న చెత్త, చేపల విసర్జితాలు మొదలైనవి తీసివెయ్యాలి. సగానికి పైగా నీటిని తీసి వేసి అప్పుడు కొత్త నీరు పొయ్యాలి. చేపలను డైరెక్ట్ గా నెట్ అవుట్ చెయ్య కుండా ఒక నీళ్ళు ఉన్న కంటైనర్ సహాయంతో బయటకు తీస్తే మంచిది. లేదంటే కొన్ని చేపలు అభద్రతకు లోనవుతాయి.

చేపలలో కూడా రక రకాల జాతికి చెందినవి ఉంటాయి. కొన్ని సడన్ గా వచ్చే మార్పులను తట్టుకుంటాయి ( ఉదా : జీబ్రా డానియో, రెడ్ జీబ్రా, గప్పీ, మొదలైనవి) . కొన్ని కొంచం తేడా వచ్చినా తట్టు కోలేవు.

అందువల్ల చేపల ఎంపిక అనేది చాలా ముఖ్యం. ఎక్కువ సమయమ కేటాయించలేని పరిస్తితులలో హార్డీ ఫిష్ ఎంపిక చేసుకోవటం అవసరం.

ఇవి మన పరిదిలో మనం చేయవలసినవి. కొన్ని సార్లు ఇతర కారణాల వాళ్ళ కూడా చనిపోవచ్చు.

నా దగ్గర మొక్కలతో కూడిన అక్వేరియం ఉంది. దానికి కంప్లీట్ క్లీనింగ్ ప్రతి నాలుగు నెలలకు ఒకసారి చేస్తుంటాను. మొక్కలు ఉండటం వల్ల మంచి ఎకో సిస్టం ఏర్పడి అవి చాలా బాగా జీవిస్తాయి. కాని మొక్కలతో కూడిన అక్వేరియం మైంటైన్ చెయ్యాలంటే ఎక్కువ శ్రద్ద అవసరం.

ఇవి నా అనుభవంతో, ఇంటర్నెట్ సహాయం తో తెలుసుకున్న విషయాలు. ఇందులో ఏమైనా తప్పులు ఉంటె బ్లాగు మిత్రులు తెలియజేయగలరు.

P S Ravi Kiran said...

@పరిమళం గారు.. అవునండి వాటిని చూసి ఆనందించిన సమయం కంటే చనిపోయినప్పుడు బాధ ఎక్కువగా ఉంది. :`-(

@రవిగారూ.. జాగ్రత్తండీ పిల్లలు కూడా ఉన్నాయి అంటున్నారు..

@శేఖర్ గారూ చాలా థాంక్సండీ.. మీరు పొందుపరిచిన విషయాలు చాలా బావున్నాయి. అసలు ఈ goldfish ముందు ఓ షాపువాడు swordtail, mollish fish ఇచ్చాడు. దాంట్లో swordtail చాలా గడుసుది. మిగతా అన్నిటిని పొడిచేది. ఒకటైతే బైటకి దూకేసింది కూడా.. ఇక మా వల్ల కాదని దెగ్గర్లో ఇంకో షాపుకి ఇచ్చేయడానికి వెల్తే వాడు ఇవి ఇచ్చాడు.
ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే మా water tank నిన్నో మొన్నో క్లీన్ చేసార్ట. chlorine content ఎక్కువ అయివుంటుంది. అప్పటికీ నీళ్ళు రాత్రి అంతా ఉంచినవే వాడాను.. కానీ.. వా..
ఈ సారి మళ్ళీ బుర్ర తిరిగితే guppies + aquarium తీసుకుంటాను. ముందు వీటి జ్ఞాపకాల లోంచి బైటకి వస్తే....

Hi Tej said...

hi frnds naa peru teja.
nenu kotthaga fishes konna kunchem miru vatiki ela jagrathalu thisukovalo cheppandi.
naa mail id tej_smily@yahoo.co.in ki mail cheyandi..