Wednesday, December 12, 2007

శివుని విశ్వరూపమా?

మొన్నీమధ్య అమ్మా వాళ్ళు వచ్చారు బెంగళురుకి. వాళ్ళు వచ్చినప్పటి నుంచీ వాన, చలి. డాడీకైతే చాలా బొర్ కొడుతొంది. వారాంతంలో ఎక్కడికైనా వెల్దామని ప్లానులు మొదలెట్టాం. ఎక్కడో ఉడిపి నుంచి ధర్మస్థల నుంచి చివరికి ఓ 90కిమి దూరంలో ఉన్న కోటిలింగేెశ్వరస్వామి గుడి కి వెల్దాం అని నిర్ణయించాం.
మరునాడు పొద్దున్నే ఓ Qualis మాట్లాడుకొని 7 కి బయలుదేరాం. మధ్యలో లో చెల్లాయి ని బావగారిని ఎక్కించుకొని 9 కల్లా అక్కడికి చెరిపొయాం.
Route:: KR puram -> Hoskote -> Kolar -> Kammasandra.



దారి పొడుగునా ఉన్న శివలింగాల్ని చుస్తుంటేనే అర్ధం అవుతుంది ఆ క్షేత్ర మహత్యం. ఒక కోటి లింగాలని ప్రతిస్టాపించలని సంకల్పం. దాదాపు 85 లక్షలు పూర్తి అయ్యాయి. లోపల కళ్ళు చెదిరి పొయేలా శివలింగాలు. అన్ని రకాలవీ ఉన్నయి.
ఒక 108 అడుగుల శివలింగం దాని ముందు ఓ 53 అడుగుల నంది ఉన్నాయి.
అమ్మ ఐతే "ఈ కార్తీక మాసం చివర్లో శివుడి విశ్వరూపం చూస్తున్నాం రా" అంటోంది.
ఈ ఫొటో ఓ శివలింగం తీసింది. :-)


కాస్త ముందుకు వెళ్ళాక బంగారు తిరుపతి అనే గుడికి వెళ్ళాము.



బైట నుంచి అంతా బానే ఉంది కానీ ఆశ్చర్యం. ఎక్కడైనా వెంకటేశ్వరస్వామి గుడి అంటే మాంఛి అలంకారం ఆర్భాటం ఉంటాయి. ఇక్కడ ఒక చిన్న రూం లొ ఓ అడుగు ఎత్తు ఉన్న విగ్రహం ఉంది. దానికి కనీసం మంచి ద్వారం కూడా లేదు. మనం చూడలి అంటె ఓ కిటికీ లోంచి చూడలి. కానీ చాలా మంది జనం వచ్చారు. ఆ మహత్యం ఏమిటో తెలిదు. పూజారి కూడా అంత బిజీగా ఉన్నాడు అడుగుదామంటే.



అక్కడ చాలా మంది బిచ్చగాళ్ళు ఉన్నారు. హటాత్తుగా వాళ్ళలో ఒకడు వచ్చి, "అన్నా ధర్మం" అన్నాడు ఓ గన్ను చూపించి. మాకు నవ్వగలేదు. చాలా మంది చిన్న పిల్లలు. కనీసం ఎలా అడుక్కొవాలో కూడా తెలీదు. వాళ్ళ అమాయకత్వానికి నవ్వుకోవాలో వాళ్ళ దుస్థితికి జాలి పడాలో వీళ్ళని ఇలా వదిలేసిన పెద్దల మిద కోప్పడాలో అర్ధం కాలెదు. .




పక్కనే ఓ పురాతన దేవాలయం ఉంది. ఇది చళుక్యులు కట్టిందంట. ఎవ్వరూ దీని బాగోగులు చూస్తునట్టు లేదు. గుడి ముందు ఒక బోన్ లో ఉన్న వినాయక విగ్రహం మాత్రం interesting గా అనిపించింది.లోపల శివలింగం ఇంకా కొన్ని విగ్రహాలు ఉన్నాయి. పూజలు అవి కూడా జరుగుతున్నాయి.


చివరగా సోమేశ్వరాలయానికి వెళ్ళాము. ఈది శ్రీకృష్ణదేవరాయలు నిర్మించాడు. ఆ శిల్పకళావైభవం అంతా హంపీలో లాగానే ఉంది. మేము వెళ్ళే సరికి ఇంకా గుడి తలుపులు తెరవలెదు కానీ మా డ్రైవరు యెవరికో చెప్పి పూజారిని పిలుచుకొచ్చాడు.



సంతొషంగా ఇక ఇంటి ముఖం పట్టాము.

2 comments:

ramya said...

బావుందండి మీ ట్రిప్.

P S Ravi Kiran said...

థాంక్సండీ రమ్యగారు.