Monday, February 11, 2008
వాహ్.. ఉస్తాద్, వాహ్.
ఈ శెనివారం బెంగళూరులో జరిగిన "A Tribute to Bangalore" కచేరీకి వెళ్ళాను. (ఆ పేరు ఎందుకు పెట్టారో అర్ధం కాలేదు).
ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ తబలా, పండిట్ శివకుమార్ శర్మ సంతూర్ మొదటి సారి జుగల్బందీ.
ముందు శివకుమార్ గారు ఝింఝోటి రాగంలో ( jhinjhoti తెలుగు లో ఎలా రాయాలో తెలీదు. :-/) ఆలాపనతో మొదలెట్టారు. జాకిర్ హుస్సేన్ మధ్యలో కలిసాక ఇక కాస్త ఊపు అందుకుంది. ఈ కచేరీ వినటం కన్న చూడటానికి చాలా బావుంటుంది. జాకిర్ హుస్సేన్ చేతి వేళ్ళు తబలా మీద ఎంత వేగంగా కదుల్తున్నాయంటే చూడటానికి ఓ high speed camera కావాలేమో అనిపిస్తుంది. శివకుమార్ శర్మ గారు ఏమీ తక్కువ తినలేదు. నేను ఎప్పుడూ సంతూర్ వినటమే గానీ వాయించటం చూడ్లేదు. 100 తంత్రులు ఉన్న ఆ వాయిద్యంలో ఒకొక్క తీగనూ అంత జాగ్రత్తగా, వేగంగా మీటి సుమధుర రాగలను పలికింపచెయటం నిజంగా అధ్భుతం.
కానీ ఆ హాల్లొ స్పీకర్లు అంత బాలేదు. పాపం జాకిర్ హుస్సేను గారు " reverbration ఎక్కువగా ఉంది. మేము వాయించేది మాకే వినపడట్లేదు" అని మొత్తుకున్నా ఎవ్వరూ వినలేదు. అది సరిచేసే సరికి సగం కచేరీ ఐపొయింది.
పదింటికల్లా చాలామంది ఓపిక లేని జనాలు వెళ్ళిపొవటంతో కాస్త మధ్య వరసలో అంబికా వాళ్ళ పక్కన సీటు దొరికింది. అప్పుడు వాళ్ళు వాయించిన పహాడీ రాగమాలికను ఓ గంట సరిగ్గా ఆనందించగలిగాం. వెళ్ళిపొయిన వాళ్ళ మీద జాలిపడ్డాం.
ఇంటికి వెళ్ళేసరికి 12. వానలో తడిసి ముద్దయ్యాను. కానీ ఈ కచేరీ మధురాలాపనలు ఎప్పటికీ మరిచిపొలేను. ఎప్పుడైనా CD దొరికితే వినండి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment