Monday, March 23, 2009

నా బంగారు చేపలకి శ్రధ్ధాంజలి.

ఈ రోజు నాకు చాలా బాధగా ఉంది.
ఓ రెండు నెలల క్రితం ఇంటికి రెండు బంగారు చేపలు తెచ్చాను. fan-tail goldfish. చాలా చిన్న పిల్లలు.
వాటి పేర్లు కూడా పెట్టాము. పెద్దది "సుమతి", కాస్త చిన్నది "కాలమతి".
వాటికి తిండి పెట్టినప్పుడు సుమతి కాస్త తెలివిగా కుండీ మధ్యలో ఉండి ముందే వేసింది వేసినట్టు తినేసేది. అందుకే దానికి ఆ పేరు.
చాలా active గా ఉండేవి. ఒక దాని వెంట ఒకటి పడుతూ కుండీలో పెట్టిన కృత్రిమ మోక్కలు, గవ్వలతో ఆడుకుంటూ... వాటికి మా మొఖాలు కూడా గుర్తే. ప్రతీరోజూ 7am/pm కల్లా మేము హాల్ లోకి రాగానే అవి తిండి కోసం డాన్సు మొదలెట్టేవి. వేరే ఎవరైనా వస్తే మొక్క వెనకాల దాక్కునేవి. ఎప్పుడైనా మా ఆవిడ వేలు పెడితే తాకనిచ్చేవి కూడా...
ఇక్కడ చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో.











ఈ రోజు నా అజాగ్రత్త వల్ల చేపపిల్లలు అకస్మాత్తుగా చనిపోయాయి. :'-(
నీరు మార్చేటప్పుడు మొత్తం అంతా ఒకేసారి మార్చకూడదు. ఈ రోజు పొరపాటున పాత నీరు అంతా పారపోసేసాను. వాటిని కొత్త నీటి లో వేయగానే పాపం ఆ చిట్టి ప్రాణాలు ఓ గంట అవస్థపడ్డాయ్. మాకు సంగతి అర్ధమయ్యేలోపు అంతా అయిపోయింది. :-(
ఇక బుధ్ధొచ్చింది. మళ్ళీ ఇలా చేపలనీ ఇంట్లోకి తేను. వాటి ప్రాణాలతో చెలగాటం ఆడే హక్కు మనకు లేదని తెలుసుకున్నాను.

Monday, May 19, 2008

ఎవరికైనా ఈ పద్యం గుర్తుంటే కాస్త సరిచేయండి.

ఎప్పుడో చిన్నప్పుడు తెలుగు పుస్తకములో చదివిన గుర్తు. నా బుర్రలో అప్పటినంచీ ఈ వాక్యం తిరుగుతోంది. పరభాషా ప్రియత్వంతో మతృభాషని చులకనగా చూసేవాళ్ళమీద వ్యాఖ్యానిస్తూ తెలుగు గురించి వీరేశలింగం పంతులుగారు అనుకుంటా, ఇలా అన్నారు.
మన భాషయే, మకరంద బిందు బృందస్యందన సుందరమగు మాతృభాషయే, మహానందకందోళ సందోహ సంధానతుందిలమగు మాతృభాషయే, నమ్రతకు నమ్రత, కఠినతకు కఠినత, వదలునకు వదలు బిగికి బిగి, జోరునకు జోరు, అన్ని వన్నెలు, అన్ని చిన్నెలు, అన్ని హొయలు, అన్ని వయ్యారములు కలిగిన భాషయే....
ఇంకా చాలా ఉండాలి. మర్చిపొయా.. ఎవరికైనా సరిగ్గా గుర్తుంటే కాస్త సరిచేయండి.

-------------------

ఈ రొజు ఇంకాస్త గట్టిగా వెదికితే ఇక్కడ (http://ourtextbooks.blogspot.com/2006/02/textbook_114082693613147526.html)

ఈ వచనం ఇంకాస్త దొరికింది. అది అన్నది పానుగంటి లక్ష్మీనరసిం హారావుగారంట.

Wednesday, April 9, 2008

ఉగాది శుభాకాంక్షలు.

సర్వధారి నామ సంవత్సరం మీ అందరికీ సంతోషాన్నీ, ఆరోగ్యాన్నీ, సంపదల్నీ ఇవ్వాలని కోరుకుంటున్నాను.

ఈ పండగ 3 రోజులు సెలవల్లో బాగా తిరిగాను. ఈ ఉగాది మా పిన్ని వాళ్ళ ఇంట్లో చాలా ఆనందంగా గడిచింది. ఈ కర్ణాటక తమిళనాడుల మధ్య గొడవల పుణ్యమా అని వెల్లూరులో లక్ష్మీనారాయణి గుడి అంతా ఖాళీగా ఉంది. మామూలుగా 4 గంటలు పట్టేదిట దర్శనానికి. ఈసారి ఎవ్వరూ లేరు. మేమే ఓ గంట కూర్చుని వచ్చాము.
1.5 టన్నుల బంగారంతో దాదాపు 550 కోట్లతో కట్టిన గుడి అది. అద్భుతంగా ఉంది. కానీ భక్తి భావం కలిగించె విధంగా లేదు అనిపించింది. అక్కడ ఫొటోలు తీయనివ్వరు కానీ ఇది ఎక్కడో అంతర్జాలం లో దొరికింది. (ఫొటోలు అవే మారతాయి)



తిరుపతిలో దర్శనం కూడా చాలా తేలికగా ఐంది.
ఉగాది అలంకారం చాలా బావుంది. పళ్ళు పూలు కలిపి దండలు కట్టారు. మొత్తం గుడి అంతా పూలతో నింపేసారు.
అంతా బానే ఉందికానీ మహాద్వారం వద్ద ఆ కొత్త చానల్ (SVBC) వాళ్ళు అనుకుంటా, శుభాకాంక్షలు బోర్డ్ పెట్టారు. వాళ్ళ తెలుగు మాత్రం ఏడిసినట్టుంది. ఉగాది అని రాయటం రాలేదు. "ఊ" రాసి ఆ దీర్ఘం చరిపేసారు. మీరే చూడండి.


ఈ కొత్త సంవత్సరంలొ ఆ శ్రీనివాసుడు జనాలకి మాతృభాష మీద అభిమానం, తెలుగు భాషా పరిజ్ఞానం కలిగిస్తాడని కోరుకుంటున్నాను.

Monday, February 11, 2008

వాహ్.. ఉస్తాద్, వాహ్.



ఈ శెనివారం బెంగళూరులో జరిగిన "A Tribute to Bangalore" కచేరీకి వెళ్ళాను. (ఆ పేరు ఎందుకు పెట్టారో అర్ధం కాలేదు).
ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ తబలా, పండిట్ శివకుమార్ శర్మ సంతూర్ మొదటి సారి జుగల్బందీ.

ముందు శివకుమార్ గారు ఝింఝోటి రాగంలో ( jhinjhoti తెలుగు లో ఎలా రాయాలో తెలీదు. :-/) ఆలాపనతో మొదలెట్టారు. జాకిర్ హుస్సేన్ మధ్యలో కలిసాక ఇక కాస్త ఊపు అందుకుంది. ఈ కచేరీ వినటం కన్న చూడటానికి చాలా బావుంటుంది. జాకిర్ హుస్సేన్ చేతి వేళ్ళు తబలా మీద ఎంత వేగంగా కదుల్తున్నాయంటే చూడటానికి ఓ high speed camera కావాలేమో అనిపిస్తుంది. శివకుమార్ శర్మ గారు ఏమీ తక్కువ తినలేదు. నేను ఎప్పుడూ సంతూర్ వినటమే గానీ వాయించటం చూడ్లేదు. 100 తంత్రులు ఉన్న ఆ వాయిద్యంలో ఒకొక్క తీగనూ అంత జాగ్రత్తగా, వేగంగా మీటి సుమధుర రాగలను పలికింపచెయటం నిజంగా అధ్భుతం.

కానీ ఆ హాల్లొ స్పీకర్లు అంత బాలేదు. పాపం జాకిర్ హుస్సేను గారు " reverbration ఎక్కువగా ఉంది. మేము వాయించేది మాకే వినపడట్లేదు" అని మొత్తుకున్నా ఎవ్వరూ వినలేదు. అది సరిచేసే సరికి సగం కచేరీ ఐపొయింది.
పదింటికల్లా చాలామంది ఓపిక లేని జనాలు వెళ్ళిపొవటంతో కాస్త మధ్య వరసలో అంబికా వాళ్ళ పక్కన సీటు దొరికింది. అప్పుడు వాళ్ళు వాయించిన పహాడీ రాగమాలికను ఓ గంట సరిగ్గా ఆనందించగలిగాం. వెళ్ళిపొయిన వాళ్ళ మీద జాలిపడ్డాం.
ఇంటికి వెళ్ళేసరికి 12. వానలో తడిసి ముద్దయ్యాను. కానీ ఈ కచేరీ మధురాలాపనలు ఎప్పటికీ మరిచిపొలేను. ఎప్పుడైనా CD దొరికితే వినండి.

Wednesday, December 12, 2007

శివుని విశ్వరూపమా?

మొన్నీమధ్య అమ్మా వాళ్ళు వచ్చారు బెంగళురుకి. వాళ్ళు వచ్చినప్పటి నుంచీ వాన, చలి. డాడీకైతే చాలా బొర్ కొడుతొంది. వారాంతంలో ఎక్కడికైనా వెల్దామని ప్లానులు మొదలెట్టాం. ఎక్కడో ఉడిపి నుంచి ధర్మస్థల నుంచి చివరికి ఓ 90కిమి దూరంలో ఉన్న కోటిలింగేెశ్వరస్వామి గుడి కి వెల్దాం అని నిర్ణయించాం.
మరునాడు పొద్దున్నే ఓ Qualis మాట్లాడుకొని 7 కి బయలుదేరాం. మధ్యలో లో చెల్లాయి ని బావగారిని ఎక్కించుకొని 9 కల్లా అక్కడికి చెరిపొయాం.
Route:: KR puram -> Hoskote -> Kolar -> Kammasandra.



దారి పొడుగునా ఉన్న శివలింగాల్ని చుస్తుంటేనే అర్ధం అవుతుంది ఆ క్షేత్ర మహత్యం. ఒక కోటి లింగాలని ప్రతిస్టాపించలని సంకల్పం. దాదాపు 85 లక్షలు పూర్తి అయ్యాయి. లోపల కళ్ళు చెదిరి పొయేలా శివలింగాలు. అన్ని రకాలవీ ఉన్నయి.
ఒక 108 అడుగుల శివలింగం దాని ముందు ఓ 53 అడుగుల నంది ఉన్నాయి.
అమ్మ ఐతే "ఈ కార్తీక మాసం చివర్లో శివుడి విశ్వరూపం చూస్తున్నాం రా" అంటోంది.
ఈ ఫొటో ఓ శివలింగం తీసింది. :-)


కాస్త ముందుకు వెళ్ళాక బంగారు తిరుపతి అనే గుడికి వెళ్ళాము.



బైట నుంచి అంతా బానే ఉంది కానీ ఆశ్చర్యం. ఎక్కడైనా వెంకటేశ్వరస్వామి గుడి అంటే మాంఛి అలంకారం ఆర్భాటం ఉంటాయి. ఇక్కడ ఒక చిన్న రూం లొ ఓ అడుగు ఎత్తు ఉన్న విగ్రహం ఉంది. దానికి కనీసం మంచి ద్వారం కూడా లేదు. మనం చూడలి అంటె ఓ కిటికీ లోంచి చూడలి. కానీ చాలా మంది జనం వచ్చారు. ఆ మహత్యం ఏమిటో తెలిదు. పూజారి కూడా అంత బిజీగా ఉన్నాడు అడుగుదామంటే.



అక్కడ చాలా మంది బిచ్చగాళ్ళు ఉన్నారు. హటాత్తుగా వాళ్ళలో ఒకడు వచ్చి, "అన్నా ధర్మం" అన్నాడు ఓ గన్ను చూపించి. మాకు నవ్వగలేదు. చాలా మంది చిన్న పిల్లలు. కనీసం ఎలా అడుక్కొవాలో కూడా తెలీదు. వాళ్ళ అమాయకత్వానికి నవ్వుకోవాలో వాళ్ళ దుస్థితికి జాలి పడాలో వీళ్ళని ఇలా వదిలేసిన పెద్దల మిద కోప్పడాలో అర్ధం కాలెదు. .




పక్కనే ఓ పురాతన దేవాలయం ఉంది. ఇది చళుక్యులు కట్టిందంట. ఎవ్వరూ దీని బాగోగులు చూస్తునట్టు లేదు. గుడి ముందు ఒక బోన్ లో ఉన్న వినాయక విగ్రహం మాత్రం interesting గా అనిపించింది.లోపల శివలింగం ఇంకా కొన్ని విగ్రహాలు ఉన్నాయి. పూజలు అవి కూడా జరుగుతున్నాయి.


చివరగా సోమేశ్వరాలయానికి వెళ్ళాము. ఈది శ్రీకృష్ణదేవరాయలు నిర్మించాడు. ఆ శిల్పకళావైభవం అంతా హంపీలో లాగానే ఉంది. మేము వెళ్ళే సరికి ఇంకా గుడి తలుపులు తెరవలెదు కానీ మా డ్రైవరు యెవరికో చెప్పి పూజారిని పిలుచుకొచ్చాడు.



సంతొషంగా ఇక ఇంటి ముఖం పట్టాము.